షర్మిల పార్టీలో చేరడం ఫై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ

Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy

గత కొద్దీ నెలలుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సొంతపార్టీ పైనే విమర్శలు చేస్తుండడం తో తాజాగా బిఆర్ఎస్ అధిష్టానం..పార్టీ నుండి సస్పెండ్ చేసింది. దీంతో నెక్స్ట్ ఏ పార్టీ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరతారనేది ఆసక్తిగా మారింది. బిజెపి , కాంగ్రెస్ పార్టీలు ఆయా పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నప్పటికీ , పొంగులేటి మాత్రం తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. ఇదే క్రమంలో వైస్ షర్మిల స్థాపించిన YSRTP లో చేరుతారనే వార్తలు ఊపందుకున్నాయి.

2014 సార్వత్రిక ఎన్నికల్లో YSRCP తరపున ఎంపీగా ఎన్నికైన పొంగులేటి.. అనంతరం బీఆర్ఎస్‌లో చేరిన సంగతి విధితమే. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గానీ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గానీ ఆయనకు పార్టీ నుంచి ఎలాంటి అవకాశం కల్పించలేదు. అయితే.. సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనకు 2019లో లోక్‌సభ టికెట్ ఏపీ సీఎం జగన్.. కేసీఆర్‌‌కు రెకమెండ్ చేసినా.. పట్టించుకోలేదని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ తరుణంలో ఈయన YSRTP లో చేరుతారనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతుండడం తో వాటిపై క్లారిటీ ఇచ్చారు. తాను YSRTP పార్టీలో చేరటం లేదని తేల్చి చెప్పారు. ఆ పార్టీలో చేరకపోడవంపై షర్మిల కోపంగా ఉందని.. మొహమాటానికి చేరి తన గొంతు తానే కోసుకోలేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ లక్ష్యంతో బయటకు వచ్చానో అలాంటి లక్ష్యం ఉన్న పార్టీలోనే చేరుతానని పొంగులేటి స్పష్టం చేశారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారనే అంశం ఇప్పటికీ సస్పెన్స్‌గానే కొనసాగుతోంది.