వైయస్ షర్మిలకు కోమటిరెడ్డి శుభాకాంక్షలు

సభకు రావాలని తనకు ఆహ్వానం అందిందన్న కోమటిరెడ్డి

హైదరాబాద్ : తెలంగాణలో ఈరోజు వైయస్ షర్మిల కొత్త పార్టీని అధికారికంగా ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా షర్మిలకు టీ.కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. షర్మిల పార్టీ సభ జరగనున్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఆగి… వైయస్సార్ అభిమానులతో ఆయన కాసేపు ముచ్చటించారు. పార్టీ ఆవిర్భావ సభకు రావాలని తనకు కూడా ఆహ్వానం అందిందని చెప్పారు. వైయస్ గొప్ప నాయకుడని కొనియాడారు. వైయస్ జయంతి సందర్భంగా భువనగిరిలో ఆయన విగ్రహానికి నివాళి అర్పించేందుకు వెళ్తున్నానని చెప్పారు.

మరోవైపు షర్మిల పార్టీకి సంబంధించిన జెండా, షర్మిల ధరించనున్న కండువాలకు పార్టీ ముఖ్యనేత కొండా రాఘవరెడ్డి చిలుకూరు బలాజీ ఆలయంలో పూజలు చేయించారు. తెలంగాణ పటంలో వైయస్సార్ బొమ్మతో పార్టీ జెండాను రూపొందించిన సంగతి తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/