జూన్ 15 నుంచి 17 వరకు హైదరాబాద్ లో జీ20 అగ్రికల్చర్ సమ్మిట్

హైదరాబాద్ లో జూన్ 15 నుంచి 17 వరకు జీ20 అగ్రికల్చర్ సమ్మిట్ జరగబోతుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్ లో ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకు చెందిన అగ్రికల్చర్ మినిస్టర్లు పాల్గొననున్నారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, కెనడా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇటలీ, ఫ్రాన్స్ , ఇండియా, జర్మనీ, జపాన్, కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, టర్కీ, యూకే, యూఎస్‌ఏ, యూరోపియన్ యూనియన్ తదితర దేశాల నుంచి హాజరు కానున్నారు.
అలాగే బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, ఒమన్, నైజీరియా, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వియత్నాం వంటి 10 దేశాలను కూడా ఆహ్వానించారు. యునైటెడ్ నేషన్స్‌కు చెందిన ప్రపంచ స్థాయి మెట్ట పరిశోధన సంస్థ ఇక్రిశాట్, ఓఈసీడీ, ఏడీబీతో పాటు ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థలు, వరల్డ్‌బ్యాంక్ సంస్థల ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరుకాబోతున్నట్లు తెలుస్తుంది.
ఇండియాలో అగ్రికల్చర్‌కు సంబధించి ఇప్పటి వరకు మూడు జీ20 సదస్సులు జరిగాయి. మొదటి సదస్సు ఫిబ్రవరిలో మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ లో నిర్వహించగా, రెండో సదస్సు(అగ్రికల్చర్ డిప్యూటీస్ మీటింగ్) మార్చి నెలాఖరులో చండీగఢ్‌లో జరిగింది. మూడోది (అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్టుల సదస్సు) ఏప్రిల్ మూడో వారంలో వారణాసిలో మూడు రోజులపాటు జరిగింది. తాజాగా నాలుగో అగ్రికల్చర్ సమ్మిట్ హైదరాబాద్‌లో జరుగనుంది.