వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్ ఏర్పాటు

A new SIT has been set up to investigate Viveka’s murder case

న్యూఢిల్లీః మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి.. కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. డిఐజీ చౌరాసియా నేతృత్వంలో కొత్త సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్‌పి ముఖేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్లు ఎస్ శ్రీమతి, పునియా, ఎస్ఐ అంకిత్ యాదవ్ సభ్యులుగా ఉండనున్నారు. ఏప్రిల్ 30లోగా విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. కుట్ర ఆరోపణల్లో నిజానిజాలు వెలికి తీయాలని సూచించింది. 6 నెలలలోపు విచారణ మొదలు కాకపోయి ఉంటే ఏ5 నిందితుడు బెయిల్‌కు అప్లై చేసుకోవచ్చని సూచించింది.