పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ రాజీనామా

తన రాజీనామా లేఖను సోనియాకు పంపిన సిద్దూ

చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. ఒక వ్యక్తి పతనం అతను రాజీ పడటం ద్వారా ప్రారంభమవుతుందని తన రాజీనామా లేఖలో సిద్దూ తెలిపారు. పంజాబ్ భవిష్యత్తు, పంజాబ్ సంక్షేమం విషయంలో తాను ఏ మాత్రం రాజీ పడలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కారణాల వల్లే తాను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. పీసీసీ పదవికి రాజీనామా చేసినప్పటికీ… కాంగ్రెస్ పార్టీకి మాత్రం సేవ చేస్తానని తెలిపారు. సిద్దూ తీసుకున్న సంచలన నిర్ణయంతో పంజాబ్ కాంగ్రెస్ కుదుపుకు గురయింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/