ఫ్యాన్స్ కు పవన్ వెన్నుపోటు: అంబటి

జనసేన పార్టీ కి కేవలం 24 సీట్లు కేటాయించడం ఫై యావత్ జనసేన శ్రేణులు రగిలిపోతున్నారు. పొత్తు లేకుండా పోటీ చేసిన కనీసం 40 సీట్లలో విజయం సాధించేదని, అసలు ఎందుకు టిడిపి తో పొత్తు పెట్టుకున్నారో అని అంత మాట్లాడుకుంటున్నారు. మొన్నటి వరకు కాస్తో కూస్తో జనసేన ఫై అభిమానం ఉండే కానీ..ఇప్పుడు 24 సీట్లకే పరిమితం కావడం తో అభిమానించిన వారంతా ఇప్పుడు ఛీ కొడుతున్నారు. ఇదే విషయాన్నీ వైసీపీ నేతలు సైతం అంటున్నారు.

వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్..తన అభిమానులకు వెన్నుపోటు పొడిచారని రాంబాబు విమర్శించారు. ‘పవన్ సీట్ల పంపకాన్ని చూసి అభిమానులు ఏడవాలో, నవ్వాలో తెలియక అయోమయంలో ఉన్నారని, పవన్, బాబు తోడు దొంగల్లా వస్తున్నారు. కానీ సీఎం జగన్ సింహంలా సింగిల్గా వస్తున్నారు. 175కు 175 సీట్లు గెలుస్తాం. ప్రజలకు మా పాలన నచ్చకపోతే మమ్మల్ని ఓడిస్తారు. మీరు ఎందుకు పొత్తులు పెట్టుకోవడం?’ అని ఆయన ప్రశ్నించారు. ‘లోకేశ్, బాబు సీట్లు ప్రకటించుకున్నారు. కానీ పవన్ తను పోటీ చేసే సీటును ప్రకటించుకోలేదు. 24 సీట్లతో సీఎం ఎలా అవుతావ్? పవన్కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే పొత్తులతో ముందుకు వస్తున్నారు. జనసైనికుల ఆత్మగౌరవాన్ని పవన్ దెబ్బతీశారు’ అని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ‘పల్లకి మోయడానికి తప్ప పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేశారు.. ఛీ’ అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.