స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ సర్కార్ క్లారిటీ, ఇప్పుడేం చెప్పలేం అంటూ…!

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు చాలా వరకు కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ హైకోర్ట్ వేసిన ప్రశ్నలు, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

Mekapati Goutham Reddy
Mekapati Goutham Reddy

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా కారణంగా నిర్వహించలేము అని స్పష్టం చేసారు. కరోనా డిసెంబర్ లోపు సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది అని, ఏ వైరస్ అయినా రెండు మూడు సార్లు వస్తుందని అన్నారు. అప్పుడు పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నవంబర్ తర్వాత పరిస్థితి గమనించి నిర్ణయం తీసుకుంటామని, బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు తప్పనిసరి కాబట్టి నిర్వహిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.