ఏపీలో కొత్తగా 3,620 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో గడచిన 24 గంటల్లో 91,231 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,620 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 617 కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరిలో 565 కేసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 451 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 44 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 5,757 మంది కరోనా నుంచి కోలుకోగా, 41 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఏడుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18,85,716 పాజిటివ్ కేసులు నమోదవగా… 18,32,971 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 40,074 మందికి చికిత్స కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12,671కి పెరిగింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/