ప్రజా రవాణా విషయంలో మే 15 తర్వాతే నిర్ణయం !

స్పష్టత ఇవ్వని కేంద్ర మంత్రుల భేటీ

New Dehli: దేశ వ్యాప్త లాక్ డౌన్ మే 3 తేదీవరకూ అమలులో ఉంటుంది. అయితే ఆ తరువాత పరిస్థితి ఏమిటన్న దానిపై అందరిలోనూ అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

రేపటి నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చినా ప్రజా రవాణాకు అందులో చోటు కల్పించలేదు. అయితే మే 3 తరువాత కూడా ప్రజారవాణాకు అనుమతి ఉంటుందా అంటే అనుమానమే అంటున్నారు నిపుణులు.

రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో భేటీ అయిన మంత్రుల బృందం కూడా ఈ విషయంలో ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు.

ప్రజా రవాణా విషయంలో మే 15 తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం :https://www.vaartha.com/specials/career/