భారత్‌లో కొత్తగా 95,735 పాజిటివ్‌ కేసులు

కోలుకున్న‌ వారు 34,71,784 మంది

corona virus- india

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా 95,735 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,65,864కి చేరింది. అదే సమయంలో 1,172 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 75,062కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 34,71,784 మంది కోలుకున్నారు. 9,19,018 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 5,29,34,433 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,29,756 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/