95 వ ఆస్కార్ విజేతలు వీరే

95వ ఆస్కార్ అవార్డుల వేదిక లాస్ ఏంజిల్స్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు గెలిచి సత్తా చాటింది. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ విజేతగా నిలిచింది. వేడుకల్లో రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, కీర‌వాణి, రాహుల్ సిప్లిగంజ్‌, కాల భైర‌వ‌, ప్రేమ్ ర‌క్షిత్ త‌దిత‌రులు భాగ‌మ‌య్యారు. 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందించారు. అందులో నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు వచ్చింది.

ఇక విజేతల విషయానికి వస్తే..

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – నాటు నాటు (ఆర్ఆర్ఆర్)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచ‌ర్ ఫిల్మ్ – పినాకియో
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట‌ర్ – కే హ్యు వాన్
ఉత్త‌మ స‌హాయ న‌టి – జెమీ లీ క‌ర్టీస్‌
బెస్ట్ డాక్యుమెంట‌రీ ఫిల్మ్ – న‌వాల్నీ
బెస్ట్ మేకప్ – ది వేల్ (అడ్రియన్ మోరాట్, జూడీ చిన్, అన్నే మ్యార్లీ బ్రాడ్లీ)
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ – ది ఎలిఫెంట్ విస్పరర్స్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – క్రిస్ట్రియన్ ఎం గోల్డ్ బెక్ ( ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
బెస్ట్ ఇంటర్నేషన్ ఫిల్మ్ – ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
బెస్ట్ సినిమాటోగ్రఫీ -జేమ్స్ ఫ్రెండ్( ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – వాకర్ బెర్టెల్ మాన్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
బెస్ట్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – ఎన్ ఐరిష్ గుడ్ బై
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ -అవతార్ 2 (అవతార్ ది వే ఆఫ్ వాటర్)
బెస్ట్ కాస్ట్యూమ్స్ – బ్లాక్‌ పాంథర్‌ – వకాండా ఫారెవర్‌
బెస్ట్ యానిమేటెడ్‌ షార్ట్ ఫిల్మ్ – ది బోయ్‌, ది మోల్‌, ది ఫాక్స్ అండ్‌ ది హార్స్
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – షెరా పాల్లే
బెస్ట్ యాక్టర్ – బ్రెండన్ ఫాస్టర్ (ది వేల్)
బెస్ట్ యాక్ట్రెస్ – మిచెల్లి యాహో
బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ ఎడింగ్ – ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్
బెస్ట్ సౌండ్ డిజైన్ – టాప్ గన్