దేశంలో కొత్త‌గా 9,119 క‌రోనా కేసులు

మొత్తం 4,66,980 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. దేశంలో కొత్త‌గా 9,119 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే నిన్న క‌రోనా నుంచి 10,264 మంది కోలుకున్నారు. క‌రోనాతో మ‌రో 396 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 539 రోజుల క‌నిష్ఠానికి చేరుకుంది.

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనాతో 1,09,940 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,39,67,962 మంది కరోనా నుంచి కోలుకున్నారు. క‌రోనాతో మొత్తం 4,66,980 మంది మృతి చెందారు. మొత్తం 63,59,24,763 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. మొత్తం 119,38,44,741 డోసుల వ్యాక్సిన్ వేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/