విడాకుల తర్వాత ఫస్ట్ టైం అక్కినేని కాంపౌండ్ లో అడుగుపెట్టిన సమంత

Samantha-Latest-Pics-from-the-sets-of-SamJam
Samantha-Latest-Pics-from-the-sets-of-SamJam

అక్కినేని నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం అన్నపూర్ణ కాంపౌండ్ లో అడుగుపెట్టింది. ఏమాయ చేసావే చిత్రంతో ఇండస్ట్రీ కి పరిచమైన సామ్..ఆ చిత్రం తోనే చైతు తో ప్రేమలో పడింది. కొంతకాలం వరకు ఇద్దరు ప్రేమించుకుని..ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ సమంత అలరించింది.

వీరిద్దరి జంటను చూసి చాలామంది కుల్లుకున్నారు.ఆ రేంజ్ లో ఇద్దరు ఎంతోచక్కగా ఉంటూ ఆకట్టుకున్నారు. అయితే సడెన్ గా ఏమైందో వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ కావడం తో చాలామంది షాక్ కు గురయ్యారు. మొదట్ల ఎవ్వరు నమ్మలేదు కానీ ఆ తర్వాత వీరిద్దరూ తమ విడాకులు ప్రకటించడం తో నమ్మక తప్పలేదు. విడాకుల అనంతరం ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఈ తరుణంలో సమంత అన్నపూర్ణ స్టూడియో లో కనిపించడం అందర్నీ షాక్ కు గురి చేసింది. సమంత ఎందుకు వచ్చిందా అని అంత ఆరా తీయడం స్టార్ట్ చేసారు. ఈమె రావడానికి కారణం శాకుంతలం సినిమానే అంటున్నారు. ఈ సినిమా డబ్బింగ్ కోసం ఆమె అన్నపూర్ణ స్టూడియో కు వచ్చినట్లు తెలుస్తుంది.