వియత్నంలో భారీ వర్షాలు..90 మంది మృతి

90 dead, 34 missing in Vietnam floods, landslides

హనో§్‌ు: వియత్నంలో రెండువారాలుగా కురుస్తున్న భారీవర్షాలకుతోడు కొండచరియలు విరిగిపడి 90 మందికిపైగా మృతిచెందగా 34 మంది గల్లంతయ్యారు. క్వాంగ్ ట్రై, తువా థియన్ హ్యూ, క్వాంగ్ నామ్ ప్రావిన్స్‌లలో అధిక ప్రాణనష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం వరకు ఈ మూడు ప్రావిన్స్‌లోని 37,500 ఇండ్లలోని 1,21,280 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.

5,31,800 పశువులు, పౌల్ట్రీ ఫామ్‌లు తుడుచుపెట్టుకుపోయాయి. పలు జాతీయరహదారులు, స్థానిక రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో సెంట్రల్ నెఘీ అన్, హాటిన్హ్ ప్రావిన్సులలో ముందుజాగ్రత్తగా పాఠశాలలను ముసేశారు. సెంట్రల్‌ వియత్నంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 600 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదై ప్రమాదకర వరదలు సంభవించవచ్చని హెచ్చరించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/