చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఓ నగరంలో లాక్‌డౌన్‌

China locks down the city of 9 million people amid new Covid wave

బీజింగ్‌: చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. రెండేండ్ల గరిష్ఠస్థాయికి కేసులు చేరాయి. దీంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తున్నది. 90 లక్షల జనాభా ఉన్న చాంగ్‌చున్‌ నగరంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో ప్రజలు ఇండ్లకే పరిమితం కానున్నారు. శుక్రవారం దేశవ్యాప్తంగా 397 కేసులు నమోదయ్యాయి. అందులో జిలిన్‌ ప్రావిన్సులో 98 కేసులు నమోదయ్యాయి. చాంగ్‌చున్‌ సిటీలో రెండే కేసులు వచ్చినప్పటికీ నగరంలో లాక్‌డౌన్‌ విధించడం గమనార్హం. కొవిడ్‌పై జీరో టాలరెన్స్‌ విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తున్నది. అందులో భాగంగానే ఒకటి రెండు కేసులు నమోదైనా కఠిన ఆంక్షలు విధిస్తున్నది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/movies/