ఏపిలో కొత్తగా 8,096 కరోనా కేసులు

రాష్ట్రంలో 84,423 యాక్టివ్ కేసులు

corona virus -ap

అమరావతి: ఏపిలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 8,096 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 67 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,09,558కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 84,423 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 5,19,891 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 5,244కు పెరిగింది. గడచిన 24 గంటల్లో 11,803 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. కాగా ఈరోజు రాష్ట్రంలో 49,59,081 శాంపిల్స్‌ పరీక్షించారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు..

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/