ఒప్పంద నియామకాలు రెగ్యులరైజ్‌ అయ్యేనా?

ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలి

contract appointments
contract appointments

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేప ట్టిన ఔట్‌సోర్సింగ్‌, ఒప్పంద నియా మకాలు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇలా ఎందరు ముఖ్య మంత్రుల పదవిలో కొనసాగినా డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేపట్టకుండా దశాబ్దాలు మారినా ఇప్పటికీ వారినే కొనసాగించడం దేనికి నిద ర్శనమో అర్థం కాని పరిస్థితి.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారిలో కొందరికి ఉద్యోగ విరమణ వయసొచ్చినా కొలువ్ఞలకు భద్రత లేకుండా పోయిందని చెప్పచ్చు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా నాయకులు, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ నియామకాలు లేకుండా చేస్తామని చెప్పి, ప్రస్తుతం ఆ తరహాలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రోల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించి రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పిన మాట వాస్తవం.

అందుకే డిపార్ట్మ్‌ం ట్‌లో పనిచేస్తున్న ఆ తరహా ఉద్యోగులందరూ, ఎక్కడికక్కడ సంఘాలను ఏర్పరుచుకొని ఉద్యమంలో పాల్గొన్నవిషయం సైతం అందరికీ తెలిసిందే.

ఆ తర్వాత ఎన్నో పరిణామాల దృష్ట్యాప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక ఇప్పటికీ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి 2.10లక్షల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో కొలువులు నిర్వహిస్తుండగా అందులో 1.45లక్షలమంది ఔట్‌సోర్సింగ్‌, 65వేల మంది కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియామకమై విధులు నిర్వ హిస్తూ వస్తున్నారు.

వీరంతా ఒక విభాగంలో కాకుండా విద్య, వైద్య,వ్యవసాయ, రెవెన్యూ,రక్షణ,విద్యుత్‌ శాఖలకు సంబంధిం చిన వీరు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక సైతం పలుమార్లు కొలువ్ఞలను శాశ్వతం చేయాలని పోరాటాల బాట పట్టిన సందర్భాలను సైతం చవిచూశాం.

ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ పద్ధతిలో కొలువ్ఞదీరిన ఉద్యోగులందరూ ప్రతి సంవత్సరం రెన్యు వల్‌ చేసుకుంటూ ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా కొలువ్ఞలు చేయాల్సి ఉంటుంది.

రేపోమాపో పర్మినెంట్‌ కాబోదా? అని వెయ్యి కళ్లతో ఎదురుచూసినా, అలాంటి ప్రక్రియ చేపట్టడానికి సాధ్యపడదని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో వారి ఆశలు క్రమంగా ఆవిరైపోతున్నాయనడంలో ఎలాంటి అబద్ధం లేదు.

తెలంగాణ వచ్చాక వారిని రెగ్యులరైజ్‌ చేయకపోగా నూతనంగా వ్యవసాయ శాఖలో 200 ఏవో ఆఫీసర్లు, నీటిపారుదల శాఖలో కంప్యూటర్‌ ఆపరేటర్స్‌, ఇతర సిబ్బంది 1500 అభ్యర్థులను, కొత్తగా ప్రారం భించిన 661 గురుకులాలలో కొంత మందిని బోధనసిబ్బందిని నియమించి మిగతా బోధనేతర సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌ ప్రాతి పదికన నియమిస్తే, జిల్లా, మండల పరిషత్‌ కార్యాలయాల్లో 4వ తరగతి ఉద్యోగాలు 1500, కొత్త,పాత గ్రామపంచా యతీలలో పాలనా వ్యవహారాలు చూసుకోవడానికి 9,335 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను మూడు సంవత్సరాలపాటు 15వేల రూపాయల వేతనాలతో కాంట్రాక్ట్‌ పద్ధతిలోనియమించడం జరిగింది.

ఇలాఉంటే త్వరలో మునిసిపల్‌ శాఖలో వార్డు ఆఫీసర్లుగా 2,298 పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలని చూస్తుంది. అలాగే పోలీసుశాఖలో గతేడాది ఔట్‌సోర్సింగ్‌ ద్వారా నియమించిన 190అభ్యర్థులను మరో ఏడాదికాలం పాటు పెంచు తూ,నూతనంగా 2,092 అదే ప్రాతిపదికన భర్తీచేయాలని చూస్తుంది.

రాష్ట్రంలో ఏర్పడిన కొత్తలో వివిధశాఖల్లో 1,51,118 ఖాళీలను గుర్తించి, ఈ ఆరేళ్లకాలంలో 58,240 కొలువులను భర్తీ చేస్తే, ఇంకా 92,870 ఖాళీలు అలాగే ఉండిపోవడం ఒకెత్తయితే, ప్రతినెల అన్ని శాఖలలో కలిపి ఆరు నుంచి ఏడు వందల మంది ఉద్యోగ విరమణ పొందడం జరుగుతుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో విద్యావ్యవస్థ తగినంత సిబ్బంది లేక నీరుగారిపోతుంది. ప్రభు త్వం సూచించిన లెక్కల ప్రకారం 6,714 జూనియర్‌ లెక్చరర్స్‌, 3,412 డిగ్రీ కాలేజీ లెక్చరర్స్‌,

2000 యూనివర్శిటీ ప్రొఫెసర్‌ 2000 పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ నియామకాలు అత్యవసరమని, త్వరగా భర్తీ చేయనున్నామని చెబుతూ, ఏళ్లు గడుస్తున్నా అదే పాట పాడుకుంటూ, ఏవేవో కారణాలు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారనడంలో ఎలాంటి అసత్యంలేదు.

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో నిరుద్యోగుల వివరాలను సేకరించడానికి తలపెట్టిన ‘వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ ద్వారా 25.50 లక్షల మంది అభ్యర్థులు తమ వివరాలను పొందుపరుచుకున్నారు. ఇప్పటికే చదువ్ఞ పూర్తి చేసుకుని, ఉద్యోగవేటలో ఉన్న అభ్యర్థులు 12 లక్షలకుపైగానే ఉంటారని ఒక అంచనా ఉంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 34.8 శాతం నిరుద్యోగిత రేటుతో, దేశంలో కంటే ఎక్కువ నిరుద్యోగిత రేటుతో కొనసాగుతుంది.రాష్ట్రం ఏర్పడ్డాక ఇక త్వరలో భర్తీ అనే విషయం వెలుగులోకి వచ్చి, కార్యాచరణ ప్రకటించి, రోజు దినపత్రికలలో ప్రకటనలతో నింపివేసింది.

ముందు ఖాళీలను గుర్తించడానికి కొంత సమయం, రోస్టర్‌ని తేల్చడానికి మరికొంత సమయం, మార్గదర్శకాలను వెలిబుచ్చడానికి ఇంకొంత సమయం, అంతా అయ్యాక ఉపకులపతుల నియామక ప్రక్రియను పూర్తి చేయడానికి సమయం తీసుకోక తప్పలేదు.

ఏదిఏమైనా అంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. ఇక నన్నా నోటీఫికేషన్‌ రాదా? అని ఎదురు చూసిన అభ్యర్థులకు నిరాశే ఎదురైంది.

ఒక్కొక్క చిక్కును విడదీసుకుంటూ వచ్చేసరికి ఉపకులపతుల కాలపరిమితి ముగిసి, మరల నూతన ఉపకులపతుల ప్రక్రియ మొదలు పెట్టారు. దీనికి ఎంత సమయం తీసుకుంటారో తెలియని పరిస్థితి దాపురించింది.

సమస్య పరిష్కరించడానికి వెంటనే నిర్ణయాలు తీసుకుని ఆచరణలో అమలు చేయాలి. అంతేగాని సాంకేతిక లోపాలను ఎత్తి చూపుతూ కాలం గడిపితే అంత శుభపరిణామం అనిపించుకోదు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని ఆచరణలో అమలుపరచాలి.

-డాక్టర్‌ పోలం సైదులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/