ఈ సంక్షోభం నుండి బయట పడేందుకు ఐదేండ్లు పట్టోచ్చు

world bank chief economist carmen reinhart

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఈ సంక్షోభం నుంచి బయట పడేందుకు చాలా సమయంపడుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త కార్మెన్ రీన్‌హర్ట్ మాట్లాడుతూ.. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐదేండ్లు పడుతుందని చెప్పారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్, షట్ డౌన్ వంటివి చేపట్టారని, ఈ పరిమిత చర్యలు ఇప్పుడు ఎత్తివేసి, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి కనీసం కోలుకోవడానికి ఐదేండ్లు పట్టొచ్చని చెబుతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆర్థిక వ్యవస్థ మరింతగా క్షీణించిందని, ఇది మరింతగా అసమానతలను పెంచుతుందని కార్మెన్ అన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/