హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 21 జరుగనున్న రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌పై 7వ అంతర్జాతీయ సదస్సు

(ఐసీఆర్‌బీఓ) ఈ సదస్సు నేపథ్యం ఆసమ్‌ రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ ఫర్‌ ఏ సస్టెయినబల్‌ ఎకోసిస్టమ్‌ (ఏరైజ్‌)గా నిర్ణయించారు.

7th International Conference on Rice Bran Oil to be held in Hyderabad on April 21

హైదరాబాద్: ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ (ఐఏఆర్‌బీఓ) ; ద సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసొసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈఏ)తో భాగస్వామ్యం చేసుకుని రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌పై 7వ అంతర్జాతీయ సదస్సు (ఐసీఆర్‌బీఓ)–2023ను ఏప్రిల్‌ 21 నుంచి ఏప్రిల్‌ 23, 2023 వరకూ హైదరాబాద్‌లోని మారియట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించనుంది. ఈ ఐసీఆర్‌బీఓ 2023 నేపథ్యంగా ఆసమ్‌ రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ ఫర్‌ సస్టెయినబల్‌ ఎకోసిస్టమ్‌ (స్థిరమైన పర్యావరణ వ్యవస్థ కోసం అద్భుతమైన రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ – ఎరైజ్‌)ను ఎంచుకున్నారు. ఈ సదస్సు నిర్వహణ విశేషాలను ఎస్‌ఈఏ ఇండియా అధ్యక్షులు శ్రీ అజయ్‌ ఝున్‌ఝువాలా ; ఐఏఆర్‌బీఓ సెక్రటరీ జనరల్‌ మరియు ఎస్‌ఏఈ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీ వీ మెహతా ; హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌–ఐఐసీటీ, సెంటర్‌ ఫర్‌ లిపిడ్‌ రీసెర్చ్‌ హెడ్‌ మరియు పూర్వ ాఫ్‌ సెంటిస్ట్‌ డాక్టర్‌ ఆర్‌ బీ ఎన్‌ ప్రసాద్‌ ; ఐసీఆర్‌బీఓ జాయింట్‌ కన్వీనర్‌ మరియు జెమినీ ఎడిబల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా లిమిటెడ్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీ పి చంద్రశేఖర రెడ్డి ; శ్రీ వెంకటరామా ఆయిల్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాస్‌ నేమానీ మరియు ఎస్‌ఈఏ, ఐఏఆర్‌బీఓ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ సమక్షంలో వెల్లడించారు.

ఈ సదస్సులో 400 మందికి పైగా డెలిగేట్లతో పాటుగా రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ ఉత్పత్తి దేశాలైన ఇండియా, చైనా, థాయ్‌ల్యాండ్‌, జపాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, వియాత్నం తదితర దేశాల నుంచి ప్రత్యేక అతిథులను సైతం ఆహ్వానించి రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ మరియు దాని విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం సన్నిహిత చర్చలను నిర్వహించనుంది. ఈ సదస్సులో ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించుకోవడంతో పాటుగా తాజా సాంకేతికతలను గురించిన సమాచారం సైతం వెల్లడించుకునే అవకాశం కల్పించనుంది. ఈ సదస్సులో రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌పై తాజా పరిశోధనలు మరియు విలువ ఆధారిత ఉత్పత్తులు గురించి చర్చించడంతో పాటుగా రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ను ప్రోత్సహించడంలో ఆయా దేశాలలో వస్తోన్న నిర్ధిష్టమైన సవాళ్లను కూడా చర్చించనున్నారు. ఈ సదస్సు ముఖ్య లక్ష్యం, ప్రపంచవ్యాప్తంగా రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ను ప్రోత్సహించడం కోసం అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించడం. ఈ సదస్సులో రైస్‌ బ్రాన్‌ ఉత్పత్తిదారులు, పరిశ్రమ గ్రూప్‌లు, విద్యా పరిశోధకులు, స్థానిక ప్రభుత్వాల నడుమ సమాచారం మెరుగుపరచడం సైతం ప్రోత్సహించనున్నారు.

ఈ సందర్భంగా సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షులు శ్రీ అజయ్‌ ఝున్‌ఝువాలా మాట్లాడుతూ ‘‘ రైస్‌బ్రాన్‌ ఆయిల్‌పై ఏడవ అంతర్జాతీయ సదస్సు (ఐసీఆర్‌బీఓ) ను ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ (ఐఏఆర్‌బీఓ) హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 22 మరియు ఏప్రిల్‌ 23 తేదీలలో నిర్వహించబోతుండటం సంతోషంగా ఉంది. ఈ సదస్సుకు ఇండియా ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండవ సారి. ఐసీఆర్‌బీఓ–2023 ఈ రంగంలోని నిపుణులు, పరిశోధకులను ఒకే దరికి తీసుకురావడంతో పాటుగా తాజా అభివృద్ధిని అన్వేషించడం, ఈ విభాగంలో అతి ముఖ్యమైన ఆవిష్కరణలను సాంకేతిక, న్యూట్రిషనల్‌ సదస్సుల ద్వారా చర్చించడం చేయనుంది. విజ్ఞాన మార్పిడి, ఆలోచనలను పంచుకోవడం, నూతన కార్యక్రమాలపై సహకారం పరంగా ఈ సదస్సు వినూత్న అవకాశాలను అందించనుంది. ఇది రైస్‌బ్రాన్‌ ఆయిల్‌, దాని విలువ ఆధారిత ఉత్పత్తుల పై పరిశోధనను మెరుగుపరచడంతో పాటుగా నూనె వినియోగాన్ని సైతం మెరుగుపరిచేందుకు ఉన్న అవకాశాలను వెల్లడించనుంది. ఈ ఉత్సాహపూరితమైన కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా పార్టిస్పెంట్లను ఆహ్వానించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.

ఎస్‌ఈఏ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మరియు ఐఏఆర్‌బీఓ సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ బీ వీ మెహతా మాట్లాడుతూ‘‘ ప్రపంచంలో వరిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తోన్న రెండవ దేశం ఇండియా. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులలో దాదాపు 40% ఇదే వాటాను ఆక్రమిస్తుంది. అంతేకాదు, ప్రపంచంలో అత్యధికంగా రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తోన్న దేశం ఇండియా. ఇక్కడ 1.9 మిలియన్‌ టన్నుల రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉన్నప్పటికీ 1.05 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి మాత్రమే చేస్తుంది. భారతదేశం, అత్యధికంగా దిగుమతి చేసుకునే వంట నూనెలపై ఆధారపడుతుంటుంది. రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ వినియోగం పెరిగితే, వంటనూనెల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. దానితో పాటుగా రైతులు తమ దిగుబడులపై అధిక ఆదాయమూ పొందగలరు. వంట నూనెల పరిశ్రమ మరియు ఎస్‌ఈఏ లు 2005 నుంచి స్థిరంగా ప్రచారం చేయడం ద్వారా రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ పట్ల అవగాహన మెరుగుపరుస్తుంది మరియు ఈ నూనెను చక్కటి మరియు ఆరోగ్యవంతమైన వంటనూనెగా అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. పోషకాల పరంగా రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ సమున్నతమైనది. ఇది గుండె మరియు సాధారణ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబం కోసం మీ ప్రస్తుత వంట విధానానికి ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయంగా కూడా నిలుస్తుంది! ఈ 7వ ఐసీఆర్‌బీఓ 2023ను ఏప్రిల్‌ 22 మరియు 23 తేదీలలో నిర్వహించబోతున్నాము. సాంకేతికత మరియు పోషకాహార పరిశోధనలను మెరుగుపరిచేందుకు ఇది తోడ్పడటంతో పాటుగా రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ను అంగీకరించేందుకు మార్గాలను అన్వేషించేందుకూ తోడ్పడనుంది’’ అని అన్నారు.

పూర్వ చీఫ్‌ సైంటిస్ట్‌ మరియు హెడ్‌– సెంటర్‌ ఫర్‌ లిపిడ్‌ రీసెర్చ్‌, సీఎస్‌ఐఆర్‌ –ఐఐసీటీ , హైదరాబాద్‌ డాక్టర్‌ ఆర్‌బీఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌పై ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించడానికి ప్రధాన కారణం, ప్రపంచవ్యాప్తంగా రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ వినియోగాన్ని ప్రోత్సహించడం మరియు రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ ఆరోగ్య ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించడం. ఈ సదస్సు ద్వారా రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ (రైస్‌ ఆయిల్‌) మరియు రైస్‌ బ్రాన్‌ యొక్క విలువ ఆధారిత ఉత్పత్తుల యొక్క అంతర్జాతీయ శాస్త్రీయ ప్రమాణాలను రూపొందించడం చేయనున్నారు. ఆసియా దేశాలలో వాణిజ్యం మరియు వ్యాపారాల నడుమ సారుప్యతను ప్రోత్సహించడంతో పాటుగా రైస్‌ బ్రాన్‌ ఉత్పత్తిదారులు, పరిశ్రమ గ్రూపులు, విద్యా పరిశోధకులు మరియు స్ధానిక ప్రభుత్వాల నడుమ మెరుగైన కమ్యూనికేషన్‌ను సైతం ప్రోత్సహిస్తుంది’’ అని అన్నారు.

ఐసీఆర్‌బీఓ జాయింట్‌ కన్వీనర్‌ మరియు జెమినీ ఎడిబల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా లిమిటెడ్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీ పి చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ ‘‘ రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌పై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు (ఐసీఆర్‌బీఓ)లో భాగం కావడం పట్ల సంతోషంగా ఉన్నాము. దీనిని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసొసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈఏ) హైదరాబాద్‌లో నిర్వహిస్తుంది. ఆరోగ్యాభిలాషులు ఇటీవలి కాలంలో రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ను వినియోగించడం క్రమంగా పెరుగుతుంది. రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ రుచిపరంగా తటస్ధంగా ఉండటంతో పాటుగా తేలిక పాటి వాసన కలిగి ఉంటుంది. దీనిలో గామా ఒరైజనాల్‌ సహా ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనికి కొలెస్ట్రాల్‌ తగ్గించే లక్షణాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ స్ధిరంగా ఉంటుంది. అందువల్ల భారతీయ వంటలకు అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. ఐసీఆర్‌బీఓ 2023 ద్వారా ప్రపంచవ్యాప్తంగా డెలిగేట్లతో మాట్లాడే అవకాశం కల్పించడంతో పాటుగా భారతదేశంలో రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ను అంగీకరించేందుకు ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ధిని సైతం తెలుసుకునే వీలు కలుగుతుంది’’ అని అన్నారు.