అమెరికాలో 24 గంటల్లో 76,570 కొత్త కేసులు

మొత్తం కేసులు 41,69,991..మొత్తం మరణాలు 1,47,333

అమెరికాలో 24 గంటల్లో 76,570 కొత్త కేసులు
america- coronavirus

అమెరికా: అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. దేశంలో గ‌త 24 గంట‌ల్లో 76,570 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 1225 మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం క‌రోనా కేసులు 41 ల‌క్ష‌లు దాటాయి. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 41,69,991 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనాతో ఇప్ప‌టివ‌ర‌కు 1,47,333 మంది మ‌ర‌ణించారు.

దేశంలో మొద‌టి క‌రోనా కేసు జ‌న‌వ‌రి 21న న‌మోద‌య్యింది. ఈ సంఖ్య‌ ప‌ది ల‌క్ష‌లకు చేరుకోవ‌డానికి 98 రోజులు ప‌ట్ట‌గా, కేవ‌లం 16 రోజుల వ్య‌వ‌ధిలోనే 30 నుంచి 40 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా అమెరికాలో గంట‌కు స‌రాస‌రి 2600 పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ‌ కాగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 1,56,51,605 పాజ‌టివ్ కేసులు న‌మోద‌వ‌గా, 6,36,464 మంది మ‌ర‌ణించారు. 95,35,213 మంది బాధితులు కోలుకోగా, 54,79,928 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/