భారత్‌లో 24గంటల్లో 6,654 కొత్త కేసులు

గత 24 గంటల్లో 137 మంది మృతి

corona-india
corona-india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 6,654 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 137 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,720కి చేరింది. ఇక కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,25,101కి చేరింది. 69,597 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా కొన్ని రోజులుగా 6,000 కంటే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను విడుదల చేసింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/