మాస్కోలో ఉగ్రదాడి.. 60 మంది మృతి

రష్యాలోని మాస్కోలో ఉగ్రవాదులు నరమేధానికి తెగబడ్డారు. ఓ షాపింగ్ మాల్లోని మ్యూజిక్ కాన్సర్ట్లో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 60 మంది చనిపోయారు. కాన్సర్ట్ హాల్లోకి చొరబడ్డ తీవ్రవాదులు కనిపించిన వారందరినీ తుపాకులతో పిట్టల్ని కాల్చినట్లు కాల్చారు. ఈ ఘటన లో 100 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ (FSB) అధికారులు వెళ్లడించారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమని ఐఎస్‌ఐఎస్‌ (ISIS) ప్రకటించింది. ఈ దాడితో భవనంపై మంటలు చెలరేగాయి. అనంతరం ఆ బిల్డింగ్‌ మొత్తం వ్యాపించడంతో ప్రాంతం మొత్తం నల్లటిపొగలు కమ్ముకున్నాయి.

తొలుత కన్సర్ట్‌ హాల్‌లోకి ప్రవేశించిన దుండగులు అక్కడున్నవారిపై కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. మ్యూజిక్‌ షో ముగియడంతో బయటకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అయితే ఏం జరుగుతుందో తెలియక అక్కన్నవారు సీట్ల మధ్య దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.