ఈడీ ఆఫీస్ కు రావడం ఫై బండ్ల గణేష్ క్లారిటీ

ఈడీ ఆఫీస్ కు రావడం ఫై బండ్ల గణేష్ క్లారిటీ

టాలీవుడ్ ఇండస్ట్రీ కి మరోసారి డ్రగ్స్ విచారణ తలనొప్పిగా మారింది. కొంతకాలం క్రితం డ్రగ్స్ విచారణ ఎంత సంచలనం రేపిందో తెలియంది కాదు. అగ్ర దర్శకులు , నటి నటులు , టెక్నీషన్స్ ను విచారించడం జరిగింది. ఇక ఇప్పుడు మరోసారి సినీ ప్రముఖులను విచారించబోతుంది.

ఇందులో భాగంగా ఈరోజు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ను విచారిస్తుంది. ఉదయం నుండి పూరి ని పలు ప్రశ్నలు అడుగుతూ ఆయన నుండి సమాదానాలు రాబడుతుంది. 2015 నుంచి బ్యాంక్ లావాదేవీలను ఈడీ అడిగినట్టు.. పూరి జగన్నాథ్ వాటిని సమర్పించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటె ఈడీ ఆఫీస్ వద్ద నిర్మాత బండ్ల గణేష్ దర్శనం ఇచ్చే సరికి ఆయనకు కూడా ఏమైనా నోటీసులు అందాయా అని మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు. ఈ తరుణంలో ఆయన ఈడీ ఆఫీస్ రావడం వెనుక అసలు కారణం తెలిపాడు.

నాకు ఎవరు నోటీసులు ఇవ్వలేదు. పూరీ జగన్నాథ్ కోసం ఇక్కడికి వచ్చాను. నాకెందుకు నోటీసులు ఇస్తారు అంటూ అక్కడి మీడియాతో మాట్లాడిన గణేష్.. ట్విట్టర్ లోను దీని గురించి ట్వీట్ చేసాడు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాకు ఏ విధమైన సంబంధం లేదు నేను పూరి గారికి మద్దతుగా మాత్రమే వచ్చాను అంటూ క్లారిటీ ఇచ్చారు.