రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ
ఈ నెల 13న అసెంబ్లీ సమావేశాలు
14వ తేదీన శాసనమండలి సమావేశాలు

హైదరాబాద్: రేపు సాయంత్రం 5 గంటలకు రాష్ర్ట మంత్రివర్గం సమావేశం కానుంది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన చట్టసవరణ బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానం అమలు, ధాన్యం కొనుగోలుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13న అసెంబ్లీ సమావేశాలు, 14న శాసనమండలి సమావేశాలు జరుపనున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 13న ఉదయం 11.30 గంటలకు ప్రారంభం అవుతాయి. మండలి సమావేశాలు ఈ నెల 14న ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతాయి. 13వ తేదీన అసెంబ్లీ ప్రవేశ పెట్టే బిల్లులను, 14న మండలిలో ప్రవేశపెడతారు. ఈ మేరకు తెలంగాణ సిఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ చట్టాల్లో మార్పులుచేర్పులకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల హైకోర్టు సూచించిన కొన్ని అంశాలపైనా చట్టసభలో చర్చించి చట్టాలు తీసుకురానున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/