కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బోనాలు జరుపుకోవాలి

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్థికసాయంగా ప్రభుత్వం రూ.15 కోట్ల విడుదల చేసిందని ఆయన వెల్లడించారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని శ్రీఉజ్జయిని మహంకాళి ఆలయం ఆవరణలో రాంగోపాల్‌పేట, మొండా మార్కెట్ డివిజన్‌లకు చెందిన వివిధ ఆలయాల కమిటీ సభ్యులకు ఆర్థికసాయం చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బోనాల ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/