బిగ్ బాస్ 5 : విన్నర్ సన్నీ అయినప్పటికీ భారీగా నగదు గెలుచుకుంది మాత్రం షన్నునే..

తెలుగు బిగ్ బాస్ 5 సీజన్ గ్రాండ్ గా ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 19 మంది సభ్యులతో సీజన్ 5 మొదలవ్వగా..ఆఖరకు ఐదుగురు సభ్యులతో చివరి వారానికి వచ్చింది. ఈ ఐదుగురు సభ్యులలో సన్నీ విజేత గా గెలిచి కప్ మాత్రమే కాదు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఐదో సీజన్‌ విజేతగా నిలిచిన వీజే సన్నీకి షో నిర్వహకులు ప్రకటించిన రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీ తో పాటు సువర్ణ భూమి తరపు నుంచి రూ. 25 లక్షల విలువైన ఫ్లాట్ కూడా దక్కింది. అలాగే, దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన ఓ అపాచీ స్పోర్ట్స్ బైక్‌ను కూడా సన్నీ గెలుచుకున్నాడు. ఇవన్నీ కలిపి అతను రూ. 78 లక్షలు గెలుచుకున్నా, 50 లక్షలు ప్రైజ్‌మనీలో అతడికి రూ. 34.40 లక్షలు మాత్రమే చేతికి వచ్చింది. టాక్స్ కట్ అవగా అదే అమౌంట్ అతని చేతికి దక్కింది.

సన్నీ విజేతగా నిలిచినప్పటికీ..సన్నీ కన్నా ఎక్కువ నగదును షన్ను దక్కించుకున్నట్లు తెలుస్తుంది. షన్నుకు యూ ట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ చూసి ఆయనకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు వినికిడి. ఒక్క వారానికి అతనికి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ముట్టజెప్పారట బిగ్ బాస్ మేకర్స్. ఈ సీజన్ లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ యాంకర్‌ రవి అందుకోగా ఆ తర్వాత ఎక్కువ పారితోషికం షన్ను అందుకున్నాడట. మొత్తంగా పదిహేనువారాలకుగానూ రూ.65 లక్షల పైనే రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సన్నీ బిగ్ బాస్ ద్వారా రూ. 34.40 లక్షల అందుకుంటే..షన్ను మాత్రం రూ.65 లక్షల పైనే అందుకున్నాడని తెలుస్తుంది.

సీజన్ 5 లో మరో రన్నరప్‌గా నిలిచినా శ్రీరామ్ చంద్ర వారానికి రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయలు అందుకున్నాడట. అంటే బిగ్‌బాస్‌ షో ద్వారా అతడు మొత్తంగా రూ.35 లక్షలు వెనకేసినట్లు తెలుస్తోంది. ఇది ఏమైనప్పటికి బిగ్ బాస్ ద్వారా పాపులర్ కావడమే కాకుండా గట్టిగా నగదును దక్కించుకున్నారు.