ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశంలోని ఎంతోమందికి స్ఫూర్తిః ప్రధాని మోడి

YouTube video
PM Modi’s speech welcoming Vice President Shri Jagdeep Dhankhar in Rajya Sabha

న్యూఢిల్లీః పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉదయ 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రధాని మోడి ప్రసంగిస్తున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశంలోని ఎంతోమందికి స్ఫూర్తి అని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యసభ చైర్మన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ధన్కర్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో బాధ్యతలను ధన్కర్ సమర్ధవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. రైతుబిడ్డ ఉపరాష్ట్రపతిగా ఎన్నకవడం సంతోషంగా ఉందని మోడీ తెలిపారు. ధన్కర్ కు చట్టాలపై ఎంతో అవగాహన ఉందన్నారు. ఈ సభతో పాటు దేశం తరుపున ధన్కర్కు అభినందనలు తెలిపారు.

జీ20 బాధ్యతలు చేపట్టిన సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని మోడీ అన్నారు. జీ20 సదస్సుకు సన్నద్ధం కావాల్సిన సమయమిదన్నారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ మంచి వేదిక అని చెప్పారు. ఇది అమృతకాలం ప్రారంభసమయమన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సులభంగా బాధ్యతతో సాధించడంలో మన పార్లమెంటు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని మోడీ అన్నారు. దేశానికి రాజ్యసభ అతిపెద్ద బలం అని.. మన ప్రధానులు చాలా మంది రాజ్యసభ సభ్యులుగా పనిచేశారని చెప్పారు:

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/