ఎన్టీఆర్ సినిమా అప్‌డేట్ వచ్చేస్తోందోచ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు తారక్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. అయితే ఆ తరువాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో తారక్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. కాగా ఈ ప్రాజెక్టును దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించనున్నట్లు గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతోంది.
ఈ సినిమా అప్‌డేట్‌ను ఏప్రిల్ 12న తారక్ 30వ ప్రాజెక్టు గురించిన అఫీషియల్ అప్‌డేట్ ఉండబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తాడా లేక కొరటాల శివ తెరకెక్కిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌న చిత్ర యూనిట్ అనౌన్స్ చేయబోతుందా అని ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి తారక్ 30వ చిత్రం నుండి రాబోయే అప్‌డేట్ ఏమిటో తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.