వారం పాటు ఢిల్లీ సరిహద్దులు మూసివేత

Delhi To Seal Borders For A Week, Only Essential Services Allowed

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ..వారం రోజుల పాటు ఢిల్లీ స‌రిహ‌ద్దుల్ని మూసివేస్తున్న‌ట్లు తెలిపారు.అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల మాత్రం మిన‌హాయింపు క‌ల్పించిన‌ట్లు కేజ్రీవాల్ చెప్పారు. పౌరుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ స‌రిహ‌ద్దులు తెరువాలా లేదా అన్న దానిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని కేజ్రీవాల్‌ తెలిపారు. ఆటోలు, ఈరిక్షాలు, ఇత‌ర వాహ‌నాల్లో ప్ర‌యాణికుల సంఖ్య‌పై ఉన్న నిబంధ‌న‌ల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు చెప్పారు. మార్కెట్ల‌లో షాపులు తెరిచేందుకు స‌రిబేసి విధానాన్ని ఇన్నాళ్లూ అమ‌లు చేశామ‌ని, కానీ ఇప్పుడు అన్ని షాపుల‌ను తెరుచుకోవ‌చ్చు అని కేజ్రీవాల్‌ తెలిపారు. బార్బ‌ర్ షాపులు, సెలూన్ల‌ను తెర‌వ‌నున్న‌ట్లు చెప్పారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/