నిర్మలా సీతారామన్‌కు ఏపి సిఎం ఫోన్‌

మత్సకారులను ఆదుకునేందుకు సాయపడాలని విజ్ఞప్తి

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: లాక్‌డౌన్‌ కారణంగా ఏపి కి చెందిన వేల మంది మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకున్నారు, వీరిలో అధికంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే ఉన్నారు. తమను ఏపి ప్రభుత్వమే ఆదుకోవాలని ఇటీవల వారు ఓ వీడియోలో మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన ఏపి సిఎం జగన్‌ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫోన్‌ చేశారు. ఏపి కి చేందిన మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకుపోయారని వారిని ఆదుకునేందుకు సాయ పడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఐఎఎస్‌ అధికారి సతీష్‌ చంద్ర కు మత్స్యకారల భాధ్యతను అప్పగించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/