ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

హైదరాబాద్‌లోని హస్తినాపురంలో విషాదం

Four family members commits suicide in hyderabad
Four family members commits suicide in hyderabad

హైదరాబాద్‌: నగరంలోని వనస్థలిపురం పరిధిలోగల హస్తినాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఓకే కుటుంబానికి చెందిన నలుగురు మూకుమ్మడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలోకెళితే…ఇబ్రహీంపట్నానికి చెందిన దంపతులు ప్రదీప్, స్వాతికి ఇద్దరు పిల్లలు. కళ్యాణ్, జయకృష్ణ. పిల్లలిద్దరికీ పురుగుల మందు తాగించి, పెద్ద వాళ్లు కూడా తాగి… అందరూ చనిపోయారు. రోజంతా… ఇంట్లోంచీ ఎవరూ బయటకు రాకపోవడంతో… చుట్టుపక్కల వాళ్లు ఆశ్చర్యపోయారు. ఏదో అవసరమై ఇంటి తలుపు తడితే… ఎవరూ తలుపు తియ్యలేదు. కాస్త గట్టిగా గొట్టినా తలుపు తియ్యలేదు. ఇదేంటా అని… కిటికీ లోంచీ చూస్తే… అందరూ పడి ఉన్నారు. అయ్యో అదేంటి అంటూ… బంధువులకు తెలిపారు. బంధువులు వచ్చి… పరిస్థితి చూసి… పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు వచ్చి… తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ నలుగురూ చనిపోయి పడివున్నట్లు గుర్తించారు. డెడ్ బాడీలను స్వాధీనం చేసుకొని… పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ కుటుంబం కొన్నాళ్లుగా ఆర్థిక సమస్యలతో అల్లాడుతోంది. చేతిలో డబ్బు లేకపోవడం, అప్పులు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో… తమకు చావే పరిష్కారం అని వాళ్లు భావించినట్లు తెలుస్తోంది. పోలీసులు అనుమానాస్పద మృతులుగా కేసు రాసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/