నిర్భయ దోషి పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ!

నిర్భయ దోషి పవన్‌ గుప్తా క్యురేటివ్‌ పిటిషన్‌

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషులకు రేపు ఉరితీతకు ఢిల్లీ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్‌ గుప్తా తన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు బెంచ్‌ ఈరోజు ప్రత్యేకంగా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ రమణ, అరుణ్‌ మిశ్రా, ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, భానుమతి, అశోక్‌ భూషన్‌తో కూడిన ధర్మాసనం ఈరోజు వాదనలు విననుంది. నిర్భయ దోషుల్లో ఇప్పటివరకు ముగ్గురు తన న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకున్నారు. కాగా పవన్‌ గుప్తా ఒక్కడే ఇప్పటివరకు వినియోగించుకోలేదు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/