డొనాల్డ్ ట్రంప్ ను వదలని కేసులు..తాజాగా మరో క్రిమినల్ కేసు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను వరుస కేసులు వదలడం లేదు. తాజాగా మరో క్రిమినల్ కేసు ఈయన ఫై నమోదు కావడం మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటికే ట్రంప్ ఫై రెండు కేసుల్లో నమోదు అయ్యాయి. రహస్య పత్రాల తరలింపు కేసు, పోర్న్ స్టార్ స్టార్నీ డేనియల్స్ వ్యవహార కేసు నమోదు కాగా.. ఇప్పుడు తాజాగా మరో కేసులో ఇరుక్కున్నారు.

2020 అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమిని తిప్పిగొట్టడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డొనాల్డ్​ ట్రంప్​పై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్​బీఐ).. క్రిమినల్ కేసు నమోదు చేసింది. అలాగే ఎన్నికల యంత్రాలను స్వాధీనం చేసుకోవడం, ట్యాంపరింగ్ ఆరోపణలపై ట్రంప్ సన్నిహితుడిపై క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయి. ట్రంప్ మద్దతుదారులు వైట్​హౌస్​పై దాడి కేసులో ఆయనపై అభియోగాలున్నాయి. అలాగే ఆ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ తన ఓటమిని తిప్పిగొట్టడానికి ప్రయత్నించారని ఆరోపణలపై తాజాగా క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ట్రంప్.. గురువారం కోర్టులో హాజరుకాబోతున్నట్లు తెలుస్తుంది.