సామాన్యులకు ఊరట కలిగే వార్త

గత కొద్దీ నెలలుగా పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదని మాట్లాడుకుంటున్నారు. ఉప్పు , పప్పు , నూనె , నెయ్యి , పాలు ఇలా ఏది పట్టుకున్న భగ్గుమంటున్నాయి. ఈ ధరలతో ఏం తింటాం..ఏం కొంటాం అని సగటు సామాన్యుడు అంటున్నారు. ఈ తరుణంలో కేంద్రం ఓ ఊరట కలిగే వార్త తెలిపింది. త్వరలో పాల ధరలు తగ్గుతాయని తెలిపింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా మాట్లాడుతూ.. పచ్చిమేత ధరలు తగ్గుముఖం పట్టాయని, వర్షాకాలం తర్వాత పాల ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు.

తీవ్రమైన వాతావరణ పరిస్థితులు పంటలను దెబ్బతీస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దాణా కొరత లేదన్నారు. రాష్ట్రాలు తగినంత స్టాక్‌ను కలిగి ఉన్నాయని చెప్పారు. సరఫరా ఖాళీని పూరించాలని కోరారు. పాల ఉత్పాదకతను మెరుగుపరచడానికి.. తీవ్రమైన పరిస్థితులను తట్టుకునే వాతావరణాన్ని తట్టుకునే జాతులపై ప్రభుత్వం కృషి చేస్తోందని రూపాలా అన్నారు.