దేశంలో కొత్తగా 3,805 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,303

న్యూఢిల్లీ: దేశంలో కారోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్న కూడా 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4.8 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 3,805 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో ఢిల్లీలో 1,656 కేసులు నమోదు కాగా ముంబైలో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. కేరళలో దాదాపు 400 కేసులు వచ్చాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 22 మంది కరోనా కారణంగా మృతి చెందారు. వీటిలో 20 మరణాలు కేరళలో నమోదయ్యాయి.

కరోనా నుంచి నిన్న 3,168 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20 వేలను దాటింది. యాక్టివ్ కేసులు 20,303కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 1,90,00,94,982 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 17,49,063 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/