బెంగాల్ ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగం

YouTube video
PM Shri Narendra Modi inaugurates Durga Puja Pandal in West Bengal

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి శరన్నవరాత్రుల సందర్భంగా బెంగాల్ ప్రజలనుద్దేశించి వర్చువల్ ప్రసంగం చేశారు. ఈ సంవత్సరం దుర్గా పూజలను కోవిడ్ మధ్య జరుపుకుంటున్నామని, భక్తులందరూ ఆదర్శప్రాయమైన నిగ్రహాన్ని చూపించాలని ఆయన పిలుపునిచ్చారు. శరన్నవ రాత్రులు దేశ ఐకమత్యాన్ని, బలాన్ని చూపుతాయని ప్రధాని నరేంద్ర మోడి పేర్కొన్నారు. బెంగాల్ నుంచి వచ్చిన సంస్కృతి, సంప్రదాయాలకు ఈ నవరాత్రులు ప్రతిబింబమని అన్నారు. వ్యక్తుల సంఖ్య తక్కువగా ఉంటే ఉండవచ్చు కానీ…. భక్తిలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ మధ్య దుర్గ పూజలను జరుపుకుంటున్నా… వ్యక్తుల ఆనందంలో, ఉత్సాహంలో ఎలాంటి మార్పూ లేదని, ఇదీ నిజమైన బెంగాల్ అని మోడి ప్రశంసించారు. కోవిడ్ కారణంగా ప్రతి ఒక్కరూ రెండు గజాల దూరం పాటిస్తూ, మాస్క్ కచ్చితంగా ధరించి పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/