మరోసారి భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

గ్యాస్ సిలిండర్ ధరను రూ. 50 పెంచుతున్నట్టు ప్రకటన
రూ. 1,052కి చేరుకున్న సిలిండర్ ధర

న్యూఢిల్లీ: గృహ వినియోగ సిలిండర్‌ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 14.2 కేజీల ఎల్​పీజీ సిలిండర్‌ ధరను రూ.50 పెంచాయి. పెంచిన ధరలు శనివారమే అమల్లోకి వచ్చాయి. దీంతో దిల్లీలో సిలిండర్​ ధర రూ.999.50కి చేరింది. హైదరాబాద్‌లో 14 కేజీల సిలిండర్‌ ధర రూ.1052కి చేరింది. దీనికి డెలివరీ బాయ్స్ తీసుకునే రూ.30 కలిపితే రూ.1082 అవుతుంది. పెంచిన ధరలు నేటినుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరను మార్చి 22న పెంచిన విషయం తెలిసిందే.

కాగా, ఈ నెల 1న కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను భారీగా పెంచిన విషయం తెలిసిందే. 19 కిలోల సిలిండర్‌పై ఒకేసారి రూ.250 వడ్డించాయి. దీంతో సిలిండర్‌ ధర రూ.2460కు పెరిగింది. వారం రోజుల వ్యవధిలోనే గ్యాస్‌ సిలిండర్‌ ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/