రానున్న మూడు రోజులు తెలంగాణలో వర్ష సూచన

రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. నైరుతి, పశ్చిమ దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని, ఈ సీజన్ లో సరిపడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/