దేశంలో ఏ స్టార్ హీరో వైఫ్ కి లేనంత ఫాలోవ‌ర్స్!

4 మిలియ‌న్ల ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ తో అల్లు అర్జున్ సతీమణి స్నేహ రికార్డు

Allu Sneha record with 4 million insta followers

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ ప్ర‌ఖ్యాత సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో స‌రికొత్త రికార్డ్ సృష్టించారు, దేశంలో ఏ స్టార్ వైఫ్ కి లేనంత ఫాలోవ‌ర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ ఇన్ స్టాగ్రామ్ లో సంపాదించుకున్నారు. మొత్తంగా 4 మిలియ‌న్ల ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ తో అల్లు స్నేహ ఓ స‌రికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి సినిమా నేప‌థ్యం లేకుండా స్నేహ ఈ ఘ‌న‌త అందుకోవ‌డం విశేషం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త‌న పిల్ల‌లు అయాన్, ఆర్హల‌తో ఆడ‌కునే స్వీట్ మూమెంట్స్ తో పాటు త‌నకు ఆస‌క్తిగా అనిపించే రంగాల‌కు సంబంధించిన పోస్ట్ లు అల్లు స్నేహ చేస్తుంటారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/