ఏపీకి మరో 3.60 లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు
2వ డోసు వారికి ప్రాధాన్యత: వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి

- గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టీకాలు
- టీకా కేంద్రాల నుంచి జిల్లాలకు తరలింపు
- వ్యాక్సిన్ కొరత కారణంగా 45 ఏళ్ళు పైబడిన వారికి 2వ డోసుకు ప్రాధాన్యత
Amravati: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మరో 3.60 లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. వాటిని టీకా కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి జిల్లాలకు పంపనున్నారు. వ్యాక్సిన్ కొరతతో 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే టీకా ఇస్తున్నారు. రెండో డోసు వేయించుకునే వారికి ప్రాధాన్యత ఇస్తామని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/