అట్టహాసంగా బాలయ్య 107 మూవీ ఓపెనింగ్

నందమూరి బాలకృష్ణ 107 మూవీ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం హైదరాబాద్ లో ఈ మూవీ పూజా కార్య క్రమాలు జరుపుకుంది. క్రాక్ మూవీ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు పలువురు టాలీవుడ్‌ దర్శకులు హాజరై అభినందనలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, బోయపాటి శ్రీను, హరీశ్‌ శంకర్‌, వి.వి.వినాయక్‌, బుచ్చిబాబు, బాబీతోపాటు మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా ఈ వేడుకలో పాల్గొన్నారు. బాలయ్య, శ్రుతిహాసన్ లపై వీవీ వినాయక్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేశారు.

తొలి షాట్ కు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. బాబి, కొరటాల శివ, బుచ్చిబాబులు ఈ చిత్ర దర్శకుడు మలినేని గోపీచంద్ కు స్క్రిప్ట్ అందజేశారు. ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నట్టు వినికిడి. ఓ పాత్రలో ఫ్యాక్షనిస్టుగా, మరో పాత్రలో స్వామీజీగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

ఇక, బాలయ్య.. త్వరలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్ ప్రతినాయకుడిగా చేశారు. పూర్ణ కీలకపాత్ర పోషించారు. తమన్ సంగీతమందించారు. మిర్యాల రవీందర్​రెడ్డి నిర్మించారు.