దేశంలో కొత్తగా 2,539 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 30,799

Coronavirus vaccine

న్యూఢిల్లీ : దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 2,539 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,491 మంది కరోనా నుంచి కోలుకోగా… 60 మంది మృత్యువాత పడ్డారు.

ఇక ప్రస్తుతం దేశంలో 30,799 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.35 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.73 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు మన దేశంలో 4,24,54,546 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య 5,16,132కి పెరిగింది. ఇప్పటి వరకు 180.80 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/