మళ్ళీ విజృంభిస్తున్న కరోనా…దక్షిణ కొరియాలో ఒకే రోజు 4 లక్షల కేసులు

76 లక్షలకు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

After China, South Korea facing worst Covid outbreak as Omicron drives up cases

సియోల్ : దక్షిణకొరియాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. కేవలం ఒకే రోజులో 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 4,00,741 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని దక్షిణకొరియా ప్రభుత్వం వెల్లడించింది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇంతటి భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. గత 24 గంటల్లో 293 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి సౌత్ కొరియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 76 లక్షలకు చేరుకుంది.

కాగా, చైనా, దక్షిణ కొరియా, వియత్నాం దేశాల్లో మళ్లీ మహమ్మారి విజృంభించడానికి ఒమిక్రాన్‌ బీఏ.2 సబ్‌ వేరియంట్‌ కారణం అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/