లాభాల బాట పట్టిన భారతీయ రైల్వే శాఖ

Withdrawal of Concessions on Railway Tickets

భారతీయ రైల్వే శాఖకు భారీగా లాభాలు వచ్చిపడ్డాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. గత ఆర్థిక ఏడాది 2021-2022 ఏడాది కంటే ఇది 25 శాతం ఎక్కవగా ఆదాయం ఆర్జించింది. ఈ విషయాన్ని రైల్వేశాఖ ప్రకటనలో వెల్లడించింది. అలాగే మార్చి 31 తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణా ద్వారా రూ.1.62 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొంది. గత ఏడాది కంటే ఇది 15 శాతం వృద్ధి చెందిందని తెలిపింది.

2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2.65 లక్షల కోట్ల భారీ నిధులను రైల్వే శాఖకు కేంద్ర బడ్జెట్ లో కేటాయించడం తెలిసే ఉంటుంది. రైల్వే శాఖ చర్యలు సత్ఫలితాలను కూడా ఇస్తున్నాయి. 2022-23 సంవత్సరంలో రైల్వే శాఖ ఆదాయం అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 25 శాతం పెరిగి రూ.2.4 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో సరుకు రవాణా ద్వారా వచ్చిన ఆదాయం రూ.1.6 లక్షల కోట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 15 శాతం ఎక్కువగా వచ్చింది. ప్రయాణికుల రూపంలో ఆదాయం సైతం భారీగా పెరిగింది. రూ.63,300 కోట్లు ప్రయాణికుల ద్వారా వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల ఆదాయంతో పోలిస్తే 61 శాతం పెరిగింది.

గతంలో ఇంత భారీ స్థాయులో వృద్ధి ఎన్నడూ కనిపించలేదని తెలిపింది. నిర్వహణ వ్యయ నిష్పత్తి 98.14 శాతంగా నమోదైందని.. సవరించిన అంచనాలకు లోబడే ఉందని పేర్కొంది. ఆదాయం పెరగడం, నిర్వహణ వ్యయంపై దృష్టి సారించడం వల్లే ఇది సాధ్యమైనట్లు తెలిపింది. దాదాపు మూడేళ్ల తర్వాత పింఛను వ్యయాన్ని పూర్తిగా తమ ఆదాయం నుంచి సమకూర్చుకోగలినట్లు పేర్కొంది.