దేశంలో కొత్తగా 2,35,532 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,04,333

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్టుగానే కనిపిస్తోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2,35,532 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 3,35,939 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 871 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 20,04,333 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక దేశంలో పాజిటివిటీ రేటు 13.39 శాతంగా ఉంది. రికవరీ రేటు 93.89 శాతానికి చేరుకుంది. మరోవైపు కేరళలో కరోనా ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. నిన్న ఒక్కరోజే అక్కడ 54,537 మంది కరోనా బారిన పడ్డారు. ఈ రాష్ట్రంలో నిన్న 352 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 165 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/