ఘోర రోడ్డు ప్రమాదం..23 మంది వలస కూలీలు మృతి

రాజస్థాన్ నుంచి వలస కూలీలతో వస్తున్న ట్రక్కు

Uttar Pradesh Accident

ఔరయ: ఉత్తరప్రదేశ్‌లో ఈరోజు తెల్లవారుజామున ఔరాయ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ నుంచి యూపీ వెళ్లుతున్న వలస కూలీల ట్రక్కును మరో ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది వలస కూలీలు మృతిచెందారు. కాగా ప్రమాదంలో మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో చాలామంది బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు ఉన్నట్టు ఔరాయ జిల్లా కలెక్టర్ అభిషేక్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/