ఈసారి కాస్త ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు

జూన్ 5న కేరళలో ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు

Kerala
Kerala

కేరళ: ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త అలస్యంగా వస్తాయని, జూన్ 5న కేరళను తాకుతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఈమేరకు భూగర్భ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ ట్వీట్ చేశారు. ఈసారి నైరుతి సీజన్ ముందే ఆరంభం అవుతోందని, మే 16నే రుతుపవనాలు అండమాన్ ను తాకుతాయని వాతావరణ విభాగం ఇటీవలే ప్రకటించింది. అయితే, బంగాళాఖాతంలో తుపాను పరిస్థితులు ఏర్పడడంతో రుతుపవనాల రాకపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/