దేశంలో కొత్త‌గా 2,288 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. తాజా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ ప్రకారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2,288 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. కరోనాతో మ‌రో 10 మంది చ‌నిపోయారు. అదే సమయంలో 3,044 మంది ఈ వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్ర‌స్తుతం 19,637 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 190.50 కోట్ల కొవిడ్ డోసుల‌ను పంపిణీ చేసిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/