నేడు సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

cm kcr

హైదరాబాద్‌: నేడు సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహంచనున్నారు. జీఎస్టీ పరిహారం చెల్లింపునకు సంబంధించి కేంద్రం రాష్ట్రాల ముందు ఉంచిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఒకే దేశం.. ఒకే పన్ను నినాదంతో 2017 నుంచి జీఎస్టీని కేంద్రం అమలు చేస్తోంది. పెట్రోల్‌, మద్యం మినహా దాదాపు అన్నింటిని జీఎస్టీలోకి తీసుకువచ్చింది. దీంతో తమకు భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉందన్న రాష్ట్రాల ఆందోళనలు చేశాయి. ఐదేళ్ల వరకు రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రతి ఏడాది, అంతకు ముందు ఏడాది వచ్చిన జీఎస్టీ రాబడుల మొత్తంతో బేరీజు వేసి.. దానికి కంటే 14శాతం అదనంగా చేర్చి ఒక బెంచ్‌ మార్కును నిర్ణయిస్తుంది. ఆ మొత్తం కంటే తక్కువ ఆదాయం వచ్చినట్లయితే ఆ లోటును జీఎస్టీ పరిహారం పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెల్లిస్తోంది. కరోనా మహమ్మారి ప్రభావం జీఎస్టీ రాబడులపై పడగా.. ఆదాయం చాలా వరకు తగ్గింది. రాష్ట్రాలు తమకు రావాల్సిన పరిహారం అంశంలో కేంద్రంపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. 


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/