ఎన్టీఆర్ 30 : లీకైన మరో పిక్

ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఎన్టీఆర్ 30 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో జనతా గ్యారేజ్ మూవీ వచ్చి భారీ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా అనగానే అందరిలో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. అదికాక ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హిట్ కొట్టడం తో ఈ సినిమా ఫై మరింత ఆసక్తి పెరిగింది.

ఇదిలా ఉంటె ఈ సినిమాకు లీకుల బెడద ఎక్కువైపోతున్నాయి. రీసెంట్ గా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా..షూటింగ్ తాలూకా పిక్స్ బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ నుంచి ఓ ఫోటో లీక్ అయ్యింది. సముద్రం బ్యాక్ డ్రాప్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక లీక్ అయిన ఫొటో ఎన్టీఆర్ ఇద్దరు ఆర్టిస్ట్ లతో మాట్లాడుతున్న సమయంలో తీసిన ఫోటో అని అర్ధమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.